IPL 2020: పూర‌న్ ఆట‌తీరును చూస్తే .. అత‌డే గుర్తుకు వ‌చ్చాడు: స‌చిన్

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో మంగళవారం ఢిల్లీ కాపిట‌ల్స్ , పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిట‌ల్స్ పై కింగ్స్‌ పంజాబ్ విజయం . ఈ విజ‌యం లో పంజాబ్ బ్యాట్స్ మెన్స్ నికోల‌స్‌‌ పూరన్‌ పాత్ర కీలకమని చెప్పొచ్చు.

Karampoori Rajesh
Published on: 21 Oct 2020 7:54 PM IST
IPL 2020: పూర‌న్ ఆట‌తీరును చూస్తే  .. అత‌డే గుర్తుకు వ‌చ్చాడు: స‌చిన్
X

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో మంగళవారం ఢిల్లీ కాపిట‌ల్స్ , పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిట‌ల్స్ పై కింగ్స్‌ పంజాబ్ విజయం . ఈ విజ‌యం లో పంజాబ్ బ్యాట్స్ మెన్స్ నికోల‌స్‌‌ పూరన్‌ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఈ సీజన్ ప్రారంభం నుంచి నికోల‌స్ పూర‌న్ అద్బుత‌మైన ఆట‌తీరుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఇప్పటివరకు కింగ్స్‌ తరపున 10 మ్యాచ్‌లాడిన పూరన్‌ 183. 22 స్ట్రైక్‌ రేట్‌తో 295 రన్స్‌ చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నికోలస్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిసిస్తున్నారు. అందులో గాడ్ ఆఫ్ క్రికెట్ , మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ దృష్టిని కూడా ఆక‌ర్షించాడు.

'ఢిల్లీతో మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ ఇన్నింగ్స్‌ అద్బుతం. అతను ఆడిన కొన్ని పవర్‌ షాట్స్‌ నాకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జేపీ డుమినిని గుర్తుచేశాయి. పూరన్‌ కొట్టిన ప్రతీ షాట్ క్లీన్‌గా ఉంటూనే మంచి పవర్‌ కలిగి ఉన్నాయి. అతని ఆటతీరు కొన్నిసార్లు డుమిని తలచుకునేలా చేసింది.' అని పేర్కొన్నాడు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story