IND vs WI: కరేబీయన్ గడ్డపై అరంగేట్రం చేయనున్న ముంబై పానీపూరీ వాలా.. 2 ఏళ్ల కష్టానికి ఫలితం..

India vs West Indies: జులై 12 నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా నుంచి వైట్ జెర్సీతో అరంగేట్రం చేయనున్నాడు.

Update: 2023-07-12 06:27 GMT

IND vs WI: కరేబీయన్ గడ్డపై అరంగేట్రం చేయనున్న ముంబై పానీపూరీ వాలా.. 2 ఏళ్ల కష్టానికి ఫలితం..

India vs West Indies: భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సైకిల్‌ను వెస్టిండీస్‌తో 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించనుంది. జులై 12 నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా నుంచి వైట్ జెర్సీతో అరంగేట్రం చేయనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే బాధ్యత యశస్వికి దక్కనుంది. కాగా, శుభ్‌మన్ గిల్ నంబర్-3లో ఆడనున్నట్లు తెలుస్తోంది.

యశస్వి జైస్వాల్ భారత జట్టులో తన స్థానాన్ని దక్కించుకోవడానికి గత 2 సంవత్సరాలుగా నిరంతరం ఎదరుచూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 21 ఏళ్ల యశస్వి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడి ఎన్నో క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు.

యశస్వి తన మొదటి ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ 2019లో ఛత్తీస్‌గఢ్‌తో ముంబై జట్టు తరపున ఆడాడు. తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో, యశస్వి బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అయితే, ఇక్కడ నుంచి అతని కెరీర్‌లో ఖచ్చితంగా కొత్త ప్రయాణం ప్రారంభమైనట్లేనని తెలుస్తోంది.

విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు..

2019లో జార్ఖండ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 154 బంతుల్లో 203 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా యశస్వి 17 ఏళ్ల 292 రోజుల వయసులో లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో యశస్వి 17 ఫోర్లు, 12 సిక్సర్లు కూడా కొట్టాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో, యశస్వి బ్యాట్ 6 మ్యాచ్‌ల్లో 112.80 సగటుతో 564 పరుగులు చేసింది.

ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రదర్శన..

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ ప్రదర్శన గురించి మాట్లాడితే, అతను 15 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లలో 80.21 సగటుతో మొత్తం 1845 పరుగులు చేశాడు. ఈ సమయంలో యశస్వి బ్యాట్‌తో 9 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల ఇన్నింగ్స్‌లు కనిపించాయి. లిస్ట్-ఎలో కూడా యశస్వి 32 మ్యాచ్‌ల్లో 53.96 సగటుతో 1511 పరుగులు చేశాడు.

Tags:    

Similar News