T20 WC 2021 IND Vs PAK: మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్ ఔట్..!

T20 WC 2021 IND Vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి.

Update: 2021-10-24 14:51 GMT
మూడో వికెట్ కోల్పోయిన టీం ఇండియా (ఫైల్ ఇమేజ్)

T20 WC 2021 IND Vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాక్‌ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఓవర్ నాలుగో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరగ్గా, మూడో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (8) బౌల్డయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) అవుటయ్యాడు. భారత్‌ స్కోరు 39/3. క్రీజ్‌లో పంత్ (4*), విరాట్ (20*) ఉన్నారు.

Tags:    

Similar News