IND vs PAK : అభిషేక్, గిల్ దెబ్బకి పాకిస్తాన్ చిత్తు.. భారత్‌కు మరో విజయం
ఆసియా కప్ 2025లో భారత జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యంతో కేవలం 18.5 ఓవర్లలోనే సాధించిపెట్టారు.
IND vs PAK : అభిషేక్, గిల్ దెబ్బకి పాకిస్తాన్ చిత్తు.. భారత్‌కు మరో విజయం
IND vs PAK : ఆసియా కప్ 2025లో భారత జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 171 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యంతో కేవలం 18.5 ఓవర్లలోనే సాధించిపెట్టారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ పవర్‌ప్లేలోనే అదరగొట్టారు. కేవలం 4.4 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ కూడా 28 బంతుల్లో 47 పరుగులు చేసి అతనికి మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు ఓపెనర్లు మొదటి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. వీరి ప్రదర్శనతో టీమిండియాకు విజయం సులభమైంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినా, తిలక్ వర్మ, సంజు శాంసన్ నిలకడగా ఆడి మ్యాచ్‌ను పూర్తి చేశారు.
బౌలింగ్‌లో భారత్ కమ్ బ్యాక్
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచి స్కోరు వేగాన్ని తగ్గించారు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లలో సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగులు చేసినా, మిడిల్ ఆర్డర్‌లో మహ్మద్ నవాజ్ (19 బంతుల్లో 21 పరుగులు), హుస్సేన్ తలత్ (11 బంతుల్లో 10 పరుగులు) నెమ్మదిగా ఆడారు. చివరి ఓవర్లలో ఫహీమ్ అష్రఫ్ 8 బంతుల్లో 20 పరుగులు చేసి స్కోరును 171కి చేర్చారు. భారత బౌలర్లలో శివం దూబే 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.