R Ashwin: ఐపీఎల్ తర్వాత కూడా అశ్విన్ హవా.. ఆస్ట్రేలియా నుండి బంపర్ ఆఫర్

R. Ashwin: క్రికెట్‌లో ఒక ఆటగాడు తన అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికితే ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది.

Update: 2025-09-03 06:13 GMT

R Ashwin: ఐపీఎల్ తర్వాత కూడా అశ్విన్ హవా.. ఆస్ట్రేలియా నుండి బంపర్ ఆఫర్

R. Ashwin: క్రికెట్‌లో ఒక ఆటగాడు తన అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికితే ఆ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. భారత క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికారు. అయితే, ఆయన క్రికెట్ ప్రయాణం ఇంకా ముగియలేదు. 38 ఏళ్ల అశ్విన్ తన కొత్త ఇన్నింగ్స్‌ను విదేశీ టీ20 లీగ్‌లలో ప్రారంభించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఆయనకు వచ్చిన ఒక భారీ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అయితే, క్రికెట్ పట్ల ఆయనకున్న నిబద్ధత ఇంకా తగ్గలేదు. 38 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల యూఏఈలో జరిగే ఐఎల్‌టీ20 లీగ్‌లో ఆడాలని అశ్విన్ ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మరో పెద్ద ఆఫర్ వచ్చింది.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, అశ్విన్ ఆస్ట్రేలియా ప్రముఖ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్‎లో పాల్గొనడానికి క్రికెట్ ఆస్ట్రేలియా‎తో చర్చలు జరుపుతున్నారు. ఇది నిజంగా అశ్విన్‌కు ఒక పెద్ద అవకాశం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే, బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన మొదటి ప్రముఖ భారత క్రికెటర్లలో అశ్విన్ ఒకరు అవుతారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం భారత జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడటానికి అనుమతించబడరు. కానీ, అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడం వల్ల ఆయనకు ఇప్పుడు ఈ అవకాశం లభించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ స్వయంగా అశ్విన్‌తో ఈ విషయంపై ఫోన్‌లో మాట్లాడినట్లు కన్ఫాం చేశారు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే తాను చాలా సంతోషిస్తానని, అశ్విన్ బిగ్ బాష్ లీగ్‌కు రావడం వల్ల చాలా లాభాలు ఉంటాయని ఆయన అన్నారు. టాడ్ గ్రీన్‌బర్గ్, అశ్విన్ మధ్య చర్చలు ఎలా జరుగుతాయో వేచి చూడాలి. అయితే, కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. ఒకవేళ అశ్విన్ బిగ్ బాష్ లీగ్‌లో ఆడితే మెల్‌బోర్న్ టీం తరఫున ఆడటానికి అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రీన్‌బర్గ్ ఇప్పుడు ఈ విషయంపై క్లబ్‌లు, ఇతర భాగస్వాములతో చర్చించి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసి అశ్విన్‌కు అందించనున్నారు. ఈ అవకాశం అశ్విన్‌కు తన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సహాయపడుతుంది. విదేశీ లీగ్‌లలో ఆడి, తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని మరింత ప్రదర్శించడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది.

Tags:    

Similar News