Tilak Varma: ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ, సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవితో పాటు పలువురు అధికారులు విమానాశ్రయానికి వచ్చి తిలక్ వర్మను కలిసి అభినందనలు తెలిపారు.