ఇద్దరు మహిళా డాక్టర్లపై దాడికి పాల్పడిన 44 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి గౌతం నగర్‌లో పండ్లు కొనడానికి వెళ్లిన సఫ్దర్ జంగ్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు. వారి వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని ఇంటి పక్కనే ఉండే 44 ఏళ్ల వ్యక్తి వాదనకు దిగాడు.
మహిళా డాక్టర్లు ఎంత వారించినా వినకుండా అసభ్య పదజాలంతో తిడుతూ, కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నామని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డాడు. 'మేమిద్దరం పండ్లు కొనడానికి వచ్చినప్పుడు దూరంగా ఉండండి అంటూ గట్టిగా అరిచాడు. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నామని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డాడు' అని మహిళా డాక్టర్లు తెలిపారు. ఇద్దరు మహిళా డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసుకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.