Liquor ATM: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇక ఎనీ టైమ్ మందు..!

Liquor ATM: ఏటీఎం అంటే అర్థం ఏంటి...ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అనే కదా..కానీ ఏటీఎం అబ్రివేషన్ కు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సరికొత్త నిర్వచనం అందించింది.

Update: 2023-05-05 06:57 GMT

Liquor ATM: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇక ఎనీ టైమ్ మందు..!

Liquor ATM: ఏటీఎం అంటే అర్థం ఏంటి...ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ అనే కదా..కానీ ఏటీఎం అబ్రివేషన్ కు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సరికొత్త నిర్వచనం అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం..తమిళతంబీలకు వెస్ట్రన్ కల్చర్ తో వారి టెక్నాలజీతో పోటీపడుతూ ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు.

తమిళనాడు ప్రభుత్వం మద్యం ద్వారా రూ.50వేల కోట్లను అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాల్లో మద్యం సేవించేందుకు ప్రత్యేక లైసెన్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఆటోమేటిక్ లిక్కర్ మెషీన్లను ఏర్పాటుచేసింది. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే..ఏ లిక్కర్ కావాలో..దానికి సరిపడా డబ్బులు వేస్తే..ఆ ఏటీఎం నుంచి మనకు నచ్చిన మందు వస్తుంది.

ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్ వద్దకు వెళితే మందు బ్రాండ్లను డిస్ ప్లే చేస్తుంది. అందులో మనకు నచ్చిన బ్రాండ్ ను ఎంచుకుంటే వెంటనే దాని ధరను మెషీన్ చూపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ రూపంలో చెల్లిస్తే..మెషీన్ కింద భాగం నుంచి మనకు కావాల్సిన బుడ్డీ బయటకు వస్తుంది. ఈ మెషీన్లు చిల్డ్ బీర్లను కూడా అందిస్తాయి. ఇకపోతే ఈ మెషీన్ల ఏర్పాట్లపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటే..మందు బాబులు మాత్రం ఇకపై మద్యం షాపులు మూసేస్తారని, ఉదయాన్నే వైన్స్ తెరవరనే టెన్షన్ ఉండదని మత్తు మత్తుగా చెబుతున్నారు.


Tags:    

Similar News