Slum Girl: బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్లమ్ గర్ల్
Slum Girl: లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా 15 ఏళ్ల బాలిక
Slum Girl: బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్లమ్ గర్ల్
Slum Girl: టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి..తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 15 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారావి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ది యువతి కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.
ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్ బికాజ్ యువర్ డ్రీమ్స్ మ్యాటర్.. అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో... నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇది సామాన్యుడికి దక్కిన విజయమని... భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని మలీషా తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రాధాన్యమని తెలిపింది.