బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బిహార్ లోని టెల్వాబజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది.

Update: 2025-12-28 05:16 GMT

పాట్నా: బిహార్ లోని టెల్వాబజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది. వంతెన పైనుంచి 8 గూడ్స్ వ్యాగిన్లు కిందపడ్డాయి. అసన్‌సోన్ నుంచి సీతామర్హీ వెళ్తుండగా లహాబాన్ - సిముల్‌తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు.

అనంతరం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని చెప్పారు. రైల్వే పోలీసులు, RPF, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బీహార్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News