Congress: మోదీ గారూ.. మణిపుర్ వెళ్లండి! ప్రధానికి విమానం టికెట్ పంపిన పవన్ ఖేరా.. సోషల్ మీడియాలో వైరల్

Congress: మణిపుర్‌లో మళ్ళీ హింస ప్రజ్వరిల్లుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. లిటాన్ సరిఖోంగ్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సాయుధ మిలిటెంట్లు ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

Update: 2026-02-14 07:24 GMT

Congress: మణిపుర్‌లో మళ్ళీ హింస ప్రజ్వరిల్లుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. లిటాన్ సరిఖోంగ్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సాయుధ మిలిటెంట్లు ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచింది.

టికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్ ఖేరా

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ప్రధాని పర్యటనను తప్పుబడుతూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. అస్సాం నుంచి మణిపుర్‌కు కేవలం గంటలో వెళ్లొచ్చని, ప్రధాని వెళ్లేందుకు వీలుగా తామే విమానం టికెట్ బుక్ చేశామని ఖేరా ప్రకటించారు.

"మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే గువాహటి నుంచి ఇంఫాల్‌కు బుక్ చేసిన విమాన టికెట్‌ను ఇక్కడ షేర్ చేస్తున్నాను. దయచేసి మణిపుర్ వెళ్లి అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వండి" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని అక్కడికి వెళ్తే ప్రజల్లో ధైర్యం పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

2023లో మొదలైన మణిపుర్ హింసలో ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మైతేయీలకు రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఘర్షణలు ఇంకా చల్లారకపోవడం, తాజాగా నాగా వర్గం ఇళ్లపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, కాంగ్రెస్ చేసిన ఈ 'టికెట్' విమర్శలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News