Indian Railways New Refund Rules 2026: రైల్వే కొత్త రూల్స్: 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే నో రీఫండ్!

Indian Railways New Refund Rules 2026: భారతీయ రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ నిబంధనల్లో భారీ మార్పులు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-04-03 12:30 GMT

Indian Railways New Refund Rules 2026: రైల్వే కొత్త రూల్స్: 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే నో రీఫండ్!

Indian Railways New Refund Rules 2026: భారతీయ రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. టికెట్ క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ నిబంధనల్లో భారీ మార్పులు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల ప్రయాణికుల జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మారిన రీఫండ్ నిబంధనలు ఇవే:

కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే ముందస్తు ప్లానింగ్ తప్పనిసరి.

8 గంటల డెడ్‌లైన్: రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉండి టికెట్ రద్దు చేస్తే, మీకు ఒక్క రూపాయి కూడా రీఫండ్ లభించదు. గతంలో ఈ పరిమితి 4 గంటలుగా ఉండేది, కానీ ఇప్పుడు దానిని 8 గంటలకు పెంచారు. 

72 గంటల ముందే రద్దు: గరిష్ట రీఫండ్ పొందాలంటే ఇకపై ప్రయాణానికి 72 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి (గతంలో ఇది 48 గంటలు). 

25% పెనాల్టీ: ప్రయాణానికి 72 గంటల నుండి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే, టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. 

50% పెనాల్టీ: ఒకవేళ 24 గంటల నుండి 8 గంటల లోపు రద్దు చేసుకుంటే ఏకంగా 50% సొమ్మును పెనాల్టీగా రైల్వే శాఖ వసూలు చేస్తుంది. 

ఎందుకు ఈ మార్పులు?

దళారుల ఆగడాలను అరికట్టడానికి మరియు సీట్ల దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా దశలవారీగా అమల్లోకి రానున్నాయి.

ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశాలు:

కఠిన నిబంధనలతో పాటు కొన్ని వెసులుబాటులను కూడా రైల్వే ప్రకటించింది.

బోర్డింగ్ పాయింట్ మార్పు: రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా మీరు ఎక్కే స్టేషన్‌ను డిజిటల్ పద్ధతిలో మార్చుకోవచ్చు. 

ఎక్కడైనా క్యాన్సిలేషన్: కౌంటర్ టికెట్లు తీసుకున్న వారు దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా తమ టికెట్‌ను రద్దు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. 

రైల్వే ప్రయాణం చేసేవారు ఇకపై పక్కా ప్లానింగ్‌తో ఉండాలని, చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Full View


Tags:    

Similar News