Adoor: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో జుక్కల్ ఎమ్మెల్యే

Adoor: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆడూర్ నియోజకవర్గ ఏఐసిసి పరిశీలకుడిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పర్యటిస్తున్నారు.

Update: 2026-04-01 11:12 GMT

Adoor: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో జుక్కల్ ఎమ్మెల్యే

Adoor: ఆడూర్ (కేరళ) కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆడూర్ నియోజకవర్గానికి ఏ ఐ సి సి పరిశీలకుడిగా వెళ్లిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు వరుసగా స్థానిక నాయకులతో సమావేశమౌతు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క స్థితి గతులను పరిశీలిస్తూ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం స్థానిక నాయకులతో కలిసి సిద్ధం చేస్తున్నారు.

ఈ సందర్భంగా బుధవారం ఆడూర్ నియోజకవర్గ నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ (LDF) ఎల్ డి ఎఫ్ ప్రభుత్వ పాలనలో ఆడుర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందలేదని , అన్ని రంగాల్లో వెనుకబాటుతనాని కి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఆదాయానికి గండి కొట్టిన గత పాలకులు.

గత పాలకులు ఆలయాల నుండి వచ్చే ఆదాయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని గత పాలకుల పై ధ్వజమెత్తారు. పేదలు, దళితులు, మైనార్టీలు, మరి ముఖ్యంగా మహిళలు ఏ ఒక్కరు LDF పాలనలో సంతృప్తి గా లేరని పేర్కొన్నారు. అందుకే ఈ సారి ప్రజలు UDF కు పట్టం కట్ట బోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆడుర్ నియోజకవర్గ అభ్యర్థి గెలుపు కు కృషి చెయ్యండి..

ఆడూర్ నియోజకవర్గ UDF ఎమ్మెల్యే అభ్యర్థి సి వి శాంత కుమార్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించడానికి నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.100 కు పైగా సీట్లలో UDF విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని చెప్పారు.

పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే ప్రతి ఒక్కరికి భవ వ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని ,ప్రజాస్వామ్య విలువలు కాపాడతారని , దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.

Tags:    

Similar News