Assembly Elections 2026: కోల్‌కతాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి పెరిగింది. కోల్‌కతాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ స్వల్ప లాఠీ చార్జికి దారితీసింది.

Update: 2026-03-31 13:16 GMT

Assembly Elections 2026

Elections 2026: కోల్‌కతాలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెలుపల మంగళవారం బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసుల కథనం ప్రకారం, టీఎంసీ మద్దతు ఉన్న బూత్ స్థాయి అధికారులు కొందరు ఓటర్ల జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పార్క్ చేసి ఉన్న వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అనంతరం బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, బీహార్, ఉత్తర ప్రదేశ్ నుండి అక్రమ ఓటర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 'ఎక్స్' వేదికగా చేసిన ఒక పోస్టులో "బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో వేలాది నకిలీ ఫారం 6 దరఖాస్తులను సమర్పిస్తూ బీజేపీ ఏజెంట్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇది ఓటర్లను హైజాక్ చేసే ప్రయత్నం." అని మమతా పేర్కొన్నారు.

ఎలక్షన్ అప్ డేట్స్..

బీజేపీ తన కేరళ మేనిఫెస్టోలో ఎయిమ్స్‌ను, తిరువనంతపురం నుండి కన్నూర్ వరకు హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. 'భక్ష్య ఆరోగ్య సురక్షా కార్డు' పథకం కింద మహిళలకు నెలకు ₹2,500, వృద్ధులకు, వితంతువులకు, నిరుపేద మహిళలకు నెలకు ₹3,000 పింఛను అందిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

అస్సాం కోసం బీజేపీ మేనిఫెస్టో లవ్ జిహాద్‌పై చర్యలు, చొరబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి పొందడం, రాష్ట్రంలో ఏకీకృత రాష్ట్ర పౌర పట్టిక (యూసీసీ)ని అమలు చేయడం, ఐదేళ్లలో యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం వంటి హామీలను ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో మొత్తం 31 హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్ అస్సాంకు ఐదు హామీలను ఇచ్చింది. వీటిలో మహిళలకు నగదు సహాయం, వయోవృద్ధులకు పింఛన్లు, ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, 100 రోజుల్లోగా గాయకుడు జుబీన్ గార్గ్‌కు న్యాయం, 10 లక్షల మంది ఆదివాసీలకు భూమి హక్కులు కల్పించడం వంటివి ఉన్నాయి.

ఎన్నికల నియమాలను ఉల్లంఘించినందుకు టీవీకే అధినేత విజయ్, అతని పార్టీకి చెందిన 5 వేల మంది కార్యకర్తలపై ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదు అయింది.

ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ఓటర్లను బెంగాల్‌లోని వివిధ జిల్లాల్లోకి అక్రమంగా తరలిస్తున్నారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. మేదినీపూర్‌లో బీహార్ నుంచి 800 మంది ఓటర్లను చేర్చారు. బీజేపీ బెంగాల్ జనాభా స్వరూపాన్ని మార్చాలని చూస్తోందమొ ఆయన అంటున్నారు.

Tags:    

Similar News