Gas Subsidy Alert : ఈరోజే చివరి రోజు! ₹300 గ్యాస్ సబ్సిడీ కావాలంటే ఇది చేయండి!

PMUY గ్యాస్ సబ్సిడీ e-KYCను మార్చి 31లోపు పూర్తి చేసి ₹300 సబ్సిడీ నేరుగా మీ అకౌంట్లో పొందండి. HP Pay యాప్ లేదా డెలివరీ ఎక్సిక్యూటివ్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకోండి.

Update: 2026-03-31 10:09 GMT

Gas Subsidy Alert : ఈరోజే చివరి రోజు! ₹300 గ్యాస్ సబ్సిడీ కావాలంటే ఇది చేయండి!

Gas Subsidy Alert : కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నారా? అయితే మీకు ఈ ముఖ్యమైన అప్‌డేట్ తప్పక తెలియాలి. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గ్యాస్ బండపై మీకు వస్తున్న రూ.300 సబ్సిడీ ఇకపైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ అకౌంట్‌లో పడాలంటే ఒక చిన్న పని చేయక తప్పదు. అదేంటంటే.. ఈ రోజు (మార్చి 31) లోపు మీ ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. లేదంటే మీకొచ్చే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయిల్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

పేద మహిళల ఆరోగ్యం కోసం, వంటగదిలో పొగను తగ్గించడం కోసం కేంద్రం ఈ ఉజ్వల యోజన తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే హెచ్‌పీసీఎల్ (HPCL) వెల్లడించిన తాజా నిబంధనల ప్రకారం.. 14.2 కిలోల సిలిండర్ వాడేవాళ్లు తమ 8వ, 9వ రీఫిల్స్‌కు సబ్సిడీ పొందాలన్నా, లేదా 5 కిలోల సిలిండర్ వాడేవాళ్లు 21వ రీఫిల్ నుంచి సబ్సిడీ అందుకోవాలన్నా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ రూ.300 డీబీటీ సబ్సిడీ ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 9 సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. లబ్ధిదారులు ప్రతి ఏడాదీ కనీసం ఒక్కసారైనా ఈ కేవైసీ అప్‌డేట్ చేస్తేనే మీ తర్వాతి గ్యాస్ బుకింగ్, డెలివరీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతాయి.

ఈ-కేవైసీ చేయించుకోవడానికి మీరు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనేమీ లేదు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చునే 'HP Pay' మొబైల్ యాప్ ద్వారా మీరే సొంతంగా బయోమెట్రిక్ కేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ యాప్ వాడటం రాకపోతే అస్సలు టెన్షన్ పడకండి. మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చే వ్యక్తికి చెప్పినా సరే, వాళ్లు క్షణాల్లో మీ ఈ-కేవైసీ పూర్తి చేస్తారు. సో, ఈ రోజుతో గడువు ముగుస్తోంది కాబట్టి వెంటనే ఈ చిన్న పని పూర్తి చేసి మీ సబ్సిడీని సేఫ్ చేసుకోండి అంటూ హెచ్‌పీసీఎల్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా లబ్ధిదారులను అలర్ట్ చేసింది.

Tags:    

Similar News