జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం...10 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం..
Jammu Kashmir: మరో 20 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం...10 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం..
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైష్ణో దేవీ యాత్రలో భాగంగా అమృత్సర్నుంచి కాట్రా వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని ఝజ్జార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంతెనపై నుంచి బస్సు వెళుతుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఘటనతో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.