Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది.

Update: 2022-01-20 12:32 GMT

Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లను క్రిమీలేయర్‌ ఆధారంగా అమలు చేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బోపన్న ధర్మాసనం ఈనెల 7న తీర్పునిచ్చింది.

2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింపజేసేందుకు 8లక్షల రూపాయల వార్షికాదాయాన్ని పరిమితిగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ బోపన్న ధర్మాసనం కీలకమైన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15-4,5లోని సమానత్వపు హక్కులో భాగంగానే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పోటీ పరీక్షలు అనేవి సామాజిక, ఆర్థిక, బలమైన వర్గాలు పొందుతున్న ప్రయోజనాల్లా చూడరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్దతకు కారణాలను మాత్రమే వెలువరించిన ధర్మాసనం మార్చిలో ఈడబ్ల్యూఎస్‌ అంశంపై పూర్తి విచారణ చేయనున్నట్టు తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల ప్రాతిపదిక ప్రమాణాలను కూడా అప్పుడే తేలుస్తామని న్యాయమూర్తులు తెలిపారు.

Full View


Tags:    

Similar News