PM Modi: ఇవాళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ తో భేటీ

PM Modi: రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశం కానున్న మోడీ

Update: 2021-09-23 04:06 GMT

నేడు అమెరికా ఉపఅధ్యక్షురాలిని కలువనున్న ప్రధాని మోడీ (ట్విట్టర్ ఇమేజ్)

PM Modi: భారత ప్రధాని మోడీ ఐదురోజల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారు. వాషింగ్టన్ మోడీ ఘన స్వాగతం పలికారు.. 3 రోజు పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని.. ఇవాళ వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ తో భేటీ కానున్నారు. ఆమెతో.. కలిసి వివిధ అంశాలపై చర్చించనున్నారు ప్రధాని.. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోడీ సమావేశం కానున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్ తో మోడీ చర్చలు జరపనున్నారు.

కరోనా ఉపద్రవం తర్వాత అమెరికా వెళ్లిన మోడీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం వెళ్లింది... ఆయన జో బైడెన్ సమావేశంతో పాటు.. ఆస్ట్రేలియా, భారత్ జపాన్, అమెరికా కూటమి సదస్సులో మోడీ పాల్గొననున్నారు. ఈ నెల 25న న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించి.. ఆదివారం రోజున భారత్ కు తిరుగుప్రయాణం కానున్నారు.

అమెరికాలో వరుస సమావేశాలతో మోడీ బిజీగా గడపనున్నారు. ఇవాళ వాషింగ్టన్‌లో మేజర్ కంపెనీల సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు. క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌‌స్టోన్ కంపెల ప్రతినిధులతో చర్చించనున్నారు. రేపు జోబైడెన్‌తో సమావేశం కానున్నారు. మరోవైపు.. జసాన్ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా చర్చలు జరపునున్నారు. అదే రోజు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాలతో కూడిన క్వాడ్ సదస్సులో పాల్గొంటారు ఈ సమావేశం ముగిశాక న్యూయార్క్ వెళ్లున్నారు.

Tags:    

Similar News