Delhi Pollution Crisis: ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం.. రాజధాని వ్యాప్తంగా గ్రాప్-4 ఆంక్షలు

Delhi Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది.

Update: 2025-12-17 08:48 GMT

Delhi Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వం కఠినమైన గ్రాప్-4 ఆంక్షలను కొనసాగిస్తోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తప్పనిసరిగా 50 శాతం సిబ్బందితో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

గ్రాప్-4 ఆంక్షల కింద బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం నిషేధించింది. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరాదని ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో తరగతులు నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు. ప్రస్తుత ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయిన నమోదిత నిర్మాణ కార్మికులకు.. 10 వేల రూపాయలు పరిహారం అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News