గుజరాత్లోని మోఢేరాలో సౌరశక్తి ప్రాజెక్టు ప్రారంభించిన మోడీ
PM Modi: 24 గంటలు బ్రేక్ లేకుండా మోఢేరాలో సౌర విద్యుత్ సరఫరా
గుజరాత్లోని మోఢేరాలో సౌరశక్తి ప్రాజెక్టు ప్రారంభించిన మోడీ
PM Modi: గుజరాత్ లోని మెహసానా జిల్లా మోఢేరా గ్రామం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇకనుంచి మోఢేరా గ్రామంలో 24 గంటలపాటు బ్రేక్ లేకుండా సోలార్ పవర్ అందుబాటులో ఉంటుంది. ప్రకృతి నుంచి లభిస్తున్న సౌరశక్తిని పూర్తిగా ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందడం, కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో.. గుజరాత్ సర్కారు ఈ కార్యక్రమానికి పూనుకుంది. గుజరాత్ లో పర్యటించిన మోడీ మోఢేరాను మోడల్ విలేజ్ గా అభివర్ణించారు. మోఢేరాలో వందలాది ఏళ్ల క్రితమే సూర్యదేవాలయం నిర్మాణమైంది. ఆ దేవాలయానికి దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలున్నాయి. అలాగే ఇవాళ పౌర్ణమితోపాటు వాల్మీకి జయంతి కావడం.. మోఢేరాలో సౌర శక్తి ప్రాజెక్టును ప్రారంభించుకోవడం ఎంతో ప్రాధాన్యమైన విషయాలుగా అభివర్ణించారు మోడీ.