Maharashtra Governor In Self-Isolation: క్వారంటైన్‌లోకి వెళ్లిన మహారాష్ట్ర గవర్నర్!‌

Maharashtra Governor In Self-Isolation: మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. ఇందులో పనిచేసే 18 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Update: 2020-07-12 07:43 GMT
Maharashtra Governor In Self-Isolation: 18 Test Coronavirus Positive At Maharashtra Raj Bhavan Governor In Self-Isolation

Maharashtra Governor In Self-Isolation: మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. ఇందులో పనిచేసే 18 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ వ్యక్తులలో గవర్నర్‌కు సమీపంలో పనిచేసే సిబ్బంది కూడా ఉన్నారు. దాంతో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. సుమారు 100 మంది రాజ్ భవన్ సిబ్బందికి COVID-19 పరీక్షలు చేశారు. దాంతో 18 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇక వారితో పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్ భవన్ అధికారులు సూచించారు.

కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (77), కుమారుడు అభిషేక్ బచ్చన్ (44) శనివారం నానావతి ఆసుపత్రిలో చేరారు. అమితాబ్ బచ్చన్ లక్షణాలు లేకుండా స్థిరంగానే ఉన్నారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే చెప్పారు.

కరోనా మహమ్మారి కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో శనివారం 8,139 కొత్త కేసులను నమోదు అయ్యాయి, దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,600 కు చేరుకుంది. పెరుగుతున్న కేసుల కారణంగా జూలై 13 నుండి పూణే జిల్లాలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. థానే లో లాక్డౌన్ ను జూలై 19 వరకు పొడిగించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాలు 90 శాతం కేసులను కలిగి ఉన్నాయి. క్రియాశీల కేసులలో 80 శాతం 49 జిల్లాల నుంచి ఉన్నాయి.

Tags:    

Similar News