Karnataka:కాపరికి కరోనా.. మేకలు,గొర్రెలను క్వారంటైన్‌కు తరలించిన అధికారులు!

Karnataka:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకూ మనుషుల పైననే తన ప్రతాపం చూపిస్తూ వస్తోంది.

Update: 2020-06-30 18:36 GMT

Karnataka: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకూ మనుషుల పైననే తన ప్రతాపం చూపిస్తూ వస్తోంది. ఇప్పుడు దీని బెడ గొర్రెలు, మేకలకి కూడా అంటుకుంది. ఈ వింత సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గోడేకేరి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా అక్కడ గొర్రెలు, మేకలు కాచుకునే ఓ కాపరికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. గత కొంతకాలంగా సదరు గొర్రెల కాపరి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడు. దీనితో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అంతేకాకుండా అతను మేపుతున్న పలు మేకలు, గొర్రెలు కూడా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టుగా స్థానిక గ్రామస్తులు గుర్తించి ఈ విషయాన్ని పశుసంవర్థకశాఖ అధికారులకి సమాచారం అందించారు. దీనితో వెంటనే అప్రమత్తం అయిన అధికారులు ఆ గ్రామానికి చేరుకొని గొర్రెలు, మేకల నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్‌ లోని పరిశోధనశాలకు పంపారు. ఇక అవి ప్లేగు వ్యాధితో బాధ పడుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇక నిర్వహించిన కరోనా పరీక్షలలో అదృష్టవశాత్తు వైరస్ సోకలేదు.. అయినప్పటికీ అధికారులు ఆ మేకలు, గొర్రెలను క్వారంటైన్‌కు తరలించారు. అయితే దీనిపైన కారణాలను అధికారులు వెల్లడిస్తూ ఆ మేకలు, గొర్రెల ప్లేగు వ్యాధితో భాదపడుతున్నాయని, ప్లేగు వ్యాధి కూడా ఓ అంటువ్యాధేనని అన్నారు.. ఇతర జంతువులకు సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వీటిని క్వారంటైన్‌కు తరలించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ దారుణం ఏంటంటే నోరులేని జీవాలు కూడా కరోనాకి టార్గెట్ అవ్వడం.


Tags:    

Similar News