India Pakistan Ceasefire: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ బ్లాక్ అవుట్..మొబైల్ టార్చి వెలుగులో పెళ్లి

Update: 2025-05-11 01:11 GMT

India Pakistan Ceasefire: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ బ్లాక్ అవుట్..మొబైల్ టార్చి వెలుగులో పెళ్లి

India Pakistan Ceasefire: భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వైమానిక దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు రాజస్థాన్ సరిహద్దు జిల్లాలను గురువారం రాత్రి పూర్తిగా బ్లాక్ అవుట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అప్పుడే జోధ్ పూర్ లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహవేడుక జరుగుతోంది. సప్తపది ప్రారంభమయ్యే సమయానికి లైట్లు ఆగిపోయాయి. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు వెలిగించిన సెల్ ఫోన్ లైట్ల వెలుతురులోనే వధువుతో వరుడు ఏడడగులు నడిచాడు. తర్వాత పురోహితులు మంత్రాలు చదువుతూ మిగతా వివాహ ఆచారాలను కూడా అదే వెలుతురులో పూర్తి కానిచ్చారు. దేశ భద్రత తమకు ముఖ్యమని వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు. 

Tags:    

Similar News