ఢిల్లీని కుదిపేస్తున్న వర్షాలు.. గత 24 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు

Delhi: వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

Update: 2023-07-09 05:21 GMT

ఢిల్లీని కుదిపేస్తున్న వర్షాలు.. గత 24 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు

Delhi: ఎడతెరిపిలేని వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నాయి. ఢిల్లీలో రెండో రోజూ భారీగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. రానున్న మరో 2,3 రోజులపాటు తీవ్ర స్ధాయిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో అండర్‌ పాస్‌లను అధికారులు మూసివేశారు.

రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం విశేషంగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయి. పంజాబ్‌, హర‍్యానా, ఛండీగఢ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే 15 ఇల్లు కూలిపోగా.. ఓ వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు.  

Tags:    

Similar News