నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీ...
General Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.
నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీ...
General Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి భౌతికకాయం సందర్శనకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి సైనికాధికారులు నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుంది.
కామరాజ్ మార్గ్ 3వ నెంబర్ బంగ్లా నుంచి అంతిమయాత్ర ప్రారంభమై కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు కొనసాగనుంది. అక్కడ సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతులకు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీ అధికారులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.