Gas Price: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్..
Gas Price: వంటగ్యాస్ ధర మరోసారి మంట మండింది.
Gas Price: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్..
Gas Price: వంటగ్యాస్ ధర మరోసారి మంట మండింది. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25 పెంచుతున్నట్టు పెట్రోలియం కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఈ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. గత జూలై 1న కూడా గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.50 పైసలు పెంచిన సంగతి తెలిసిందే.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.887 నుంచి రూ.912కి చేరింది. దిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో అత్యధికంగా రూ.886కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి.