Noida Tragedy: నోయిడాలో విషాదం.. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి నలుగురు మృతి

Noida Tragedy: మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు చెల్లించాలని డిమాండ్‌

Update: 2023-09-16 07:45 GMT

Noida Tragedy: నోయిడాలో విషాదం.. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి నలుగురు మృతి

Noida Tragedy: నోయిడాలో నిర్మాణంలోని భవనం లిఫ్ట్‌ కూలడంతో 8 మంది కార్మికులు చనిపోయారు. 14 మందితో ఉన్న లిఫ్ట్‌ కూలిపోయింది.. 8 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్తితి విషమంగా మారింది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి చేరుకున్న బంధువులకు క్షతగాత్రులను కలిసేందుకు అనుమతించడం లేదు. దీంతో బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుననారు. ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్‌ దగ్గర ఎవరూ లేరని.. గాయపడ్డవారిని తరలించేందుకు అంబులెన్స్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తు్న్నారు. మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News