Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2023-04-08 05:45 GMT

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని టిక్రీ కలాన్‌ పీవీసీ మార్కెట్‌‌ ప్లాస్టిక్‌ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News