Delhi Air Pollution Crisis: ఢిల్లీలో ప్రమాదకరంగా ఎయిర్‌పొల్యూషన్
Delhi Air Pollution Crisis: ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రమైంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాయుకాలుష్యం కూడా పెరుగుతుంది.
Delhi Air Pollution Crisis: ఢిల్లీలో ప్రమాదకరంగా ఎయిర్‌పొల్యూషన్
Delhi Air Pollution Crisis: ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రమైంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాయుకాలుష్యం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు దాటేసింది. కొన్ని ప్రాంతాల్లో 500 పాయింట్లకు పైగా నమోదవుతున్నాయి. ఢిల్లీ NCRలో విజిబిలిటీ కూడా తగ్గింది. డిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. గ్రాఫ్ 4 చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. నగరంలో కాలుష్యం పెరగడంతో అధికారులు గ్రేడ్–4 చర్యలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో హైబ్రిడ్ విధానంలో క్లాసులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మిగతా సగం మంది ఇంటి నుంచి పని చేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 461కి చేరింది. ఈ పరిస్థితుల్లో బహిరంగంగా నిర్వహించే క్రీడా కార్యకలాపాలన్నింటినీ వెంటనే నిలిపివేయాలని గాలి నాణ్యత నిర్వహణ కమిషన్, NCR రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నవంబర్ 19న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే సూచనలు జారీ చేసినప్పటికీ, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కొన్ని పాఠశాలలు, సంస్థలు ఇంకా బహిరంగ క్రీడలు నిర్వహిస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించింది.
మరొకవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి బయటకు రావాలని కోరుతున్నారు. కొందరు డబ్బు పెట్టి ఆక్సిజన్ కొనుగోలు చేసుకుని బతుకుతున్నారు. పేద, మధ్యతరగతి, వేతన జీవులు మాత్రం ఢిల్లీ కాలుష్యం బారినపడి అస్వస్థతకు గురవుతున్నారు...
ఢిల్లీలో విమాన ప్రయాణికులకు ఇండిగో సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాతావరణం ప్రభావంతో కొన్ని విమానాలు ఆలస్యమవుతాయని తెలిపింది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో విజిబిలిటీ తక్కువగా ఉండటంతోనే పలు విమానాలను దారి మళ్లించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది.