Vajpayee Statue : ఒంగోలులో వాజ్‌పేయి విగ్రహ వివాదం సద్దుమణిగింది
ఒంగోలులో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు వివాదం రేపు ఒంగోలుకు అటల్ - మోడీ సుపరిపాలన యాత్ర సౌత్ బైపాస్ రోడ్డులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
ఒంగోలులో వాజ్‌పేయి విగ్రహ వివాదం సద్దుమణిగింది
ఒంగోలులో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు.. వివాదానికి దారి తీసింది. రేపు ఒంగోలుకు అటల్ - మోడీ సుపరిపాలన యాత్ర చేరుకోనుంది. ఈ నేపథ్యంలో సౌత్ బైపాస్ రోడ్డులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వాజ్‌పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆవిష్కరించనున్నారు. అయితే.. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పేరు లేకుండా శిలాఫలకం ఏర్పాటు చేయడంతో అసలు వివాదం రాజుకుంది. మేయర్ ఎస్సీ కావడంతోనే పేరు చేర్చలేదని ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేశాయి. దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మేయర్ సుజాత పేరు చేర్చి శిలాఫలకం ఏర్పాటుతో వివాదం సద్దుమణిగింది.