జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో ఇ-బస్సు సర్వీసులు.. పూర్తిగా బ్యాటరీతో నడిచే బస్సులు
Jammu and Kashmir: శ్రీనగర్‌లో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో ఇ-బస్సు సర్వీసులు.. పూర్తిగా బ్యాటరీతో నడిచే బస్సులు
Jammu and Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకు వెళుతోంది. ఇటీవలే స్మార్ట్ సిటీగా ఎంపికైన శ్రీనగర్‌లో పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా శ్రీనగర్‌లో ఇ-బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ-బస్సులను శ్రీనగర్ వీధుల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీనగర్ స్మార్ట్ సిటీ బస్సు పేరిట బస్సులను నడుపుతున్నారు. ట్రయల్ రన్‌లో కూడా బస్సెక్కేందుకు స్తానికులు ఆసక్తి చూపారు. పూర్తిగా బ్యాటరీతో నడిచే బస్సు కావడంతో పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.
ఇ-బస్సులో అన్ని రకాల ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉన్నాయి.. వృద్ధులు, దివ్యాంగులు బస్సు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఉంది. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్యాంగులు బస్సు ఎక్కి, దిగేందుకు హైడ్రాలిక్ సిస్టమ్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. బస్సు డ్రైవర్ ఆపరేట్ చేసే ఈ లిఫ్ట్ దివ్యాంగ ప్రయాణీకులను సురక్షితంగా కిందకు దింపుతుంది. ఈ లిఫ్ట్ దివ్యాంగులకు చాలా సౌకర్యంగానే కాక.. సురక్షితంగా ఉందని ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.