నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్‌

Kejriwal: ఢిల్లీ సర్వాధికారాలు ఎల్‌జీకి ఇవ్వడాన్ని తప్పుబడుతున్న కేజ్రీవాల్

Update: 2023-05-27 03:00 GMT

నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌...సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కేజ్రీవాల్‌

Kejriwal: ఢిల్లీలో సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేజ్రీవాల్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంపై పోరాడేందుకు ఆయా పార్టీల అధినేతలను కలుస్తున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ , డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, శరత్ పవర్‌లతో భేటీ అయిన  కేజ్రీవాల్ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సమావేశం కానున్నారు. అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరనున్నారు.

Tags:    

Similar News