Padma awards 2023: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
Padma awards 2023: ఏపీ నుంచి ఎం.ఎం. కీరవాణి, చంద్రశేఖర్ ఎంపిక.. తెలంగాణ నుంచి చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్
Padma awards 2023: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
Padma awards 2023: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. పద్మ విభూషణ్ అవార్డుకు ఆరుగురు ఎంపికయ్యారు. పద్మ భూషణ్‌కు 9మంది, పద్మశ్రీకి 91మందిని కేంద్రం ఎంపిక చేసింది. ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్‌కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఏపీ నుంచి ఎం.ఎం. కీరవాణి, చంద్రశేఖర్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్, బి.రామకృష్ణారెడ్డి పద్మశ్రీ పురస్కారం వరించింది.
గత ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు కేంద్రం నామినేషన్లు స్వీకరించింది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి లిస్ట్‌ను విడుదల చేసింది. దేశంలో కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పారిశ్రామిక, తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి కేంద్ర ఏటా పురస్కారాలు ప్రకటిస్తోంది.