CBSE Inter Exam Results 2020: సీబీఎస్‌సీ ఫలితాల్లో 500 కి 499 మార్కులు సాధించిన కొచ్చి విద్యార్థిని

CBSE Inter Exam Results 2020: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న సూక్తిని అక్షరాల నిజం చేస్తున్నారు విద్యార్థులు..

Update: 2020-07-15 05:00 GMT
Alisha Pazi

CBSE Inter Exam Results 2020: శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న సూక్తిని అక్షరాల నిజం చేస్తున్నారు విద్యార్థులు.. తాజాగా కొచ్చికి చెందిన కామర్స్‌ విద్యార్థిని పి.అలిషా పాజీ అనే యువతి 500కు గాను 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 2020 సీబీఎస్‌సీ సంబంధించిన ఫలితాలను కేరళ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇందులో 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే గతేడాదితో పోల్చుకుంటే 5.38శాతం ఉత్తీర్ణత పెరిగిందని, గత ఏడాది మాత్రం 83.40 శాతం వచ్చిందని అక్కడి విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.

అయితే తాను సాధించిన విజయం పట్ల పి.అలిషా సంతోషాన్ని వ్యక్తం చేసింది.. తనకు 499 మార్కులు వచ్చినట్లు తెలయగానే చాలా ఆందపడ్డానని, కానీ మొదటగా ఇన్ని మార్కులు వస్తాయని ఊహించలేదని చెప్పుకొచ్చింది.. అయితే 98 శాతం మార్కులు మాత్రమే వస్తాయని ఉహించానని వెల్లడించింది. ఇక మొత్తం 5 సబ్టెక్టులు ఉంటే అందులో మూడు పరీక్షలు మాత్రమే రాయగా, మిగతావి రెండు వాయిదా పడ్దాయని ఆమె పేర్కొంది.. తాను రాసిన మూడు పరీక్షల్లో 100 కు 100 మార్కులు వచ్చాయని వెల్లడించింది.

ఇక తన విజయానికి కారణం అయిన తల్లిదండ్రులు, టీచర్లు, తోటి విద్యార్థులు సహకరమేనని, ఇందుకు గాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా అలిషా పేర్కొంది. ఇంటర్ అనంతరం ఎకనామిక్స్‌లో డిగ్రీ చేయాలి అనుకుంటున్నట్టుగా ఆమె వెల్లడించింది..

దివ్యాంశి జైన్‌ 600 కి 600 మార్కులు:

అంతకుముందు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్‌ (18) అనే అమ్మాయి సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాసింది.. అయితే ఈ పరీక్షల ఫలితాలు 2020, జులై 13వ తేదీ సోమవారం రోజున విడుదలయ్యాయి. ఇందులో దివ్యాంశి జైన్ కు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవనే అనాలి.. అయితే ఆర్ట్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారని విద్యావేత్తలు భావిస్తున్నారు. 

Tags:    

Similar News