బడ్జెట్ లో మీకేం కావాలి?

Update: 2019-06-08 17:13 GMT

బడ్జెట్ లో మీకేం కావాలి? అని అడుగుతోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి సూచనలు సలహాలను ఆహవానిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఎవరైనా సరే బడ్జెట్ పై సూచనలు ఇవ్వొచ్చు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలై 5న పార్లమెంట్‌లో సమర్పించబోయే బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది ఆర్థిక శాఖ. ఈ బడ్జెట్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బడ్జెట్ ఎలా ఉండాలో... బడ్జెట్‌లో మీకేం కావాలో చెప్పాలంటూ ప్రజల్ని సలహాలు, సూచనలు కోరుతోంది కేంద్ర ప్రభుత్వం. ఎవరైనా బడ్జెట్‌పై సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన mygov.in వెబ్‌సైట్‌లో కామెంట్స్ పోస్ట్ చేయొచ్చు. ఈ అవకాశం జూన్ 20 వరకే. ఆ తర్వాత వచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకోదు కేంద్రం. బడ్జెట్ సందర్భంగా ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం కోరడం ఇది కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా ఈ పద్ధతి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్ రూపొందిస్తుండటంతో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రజల అభిప్రాయాలను కోరుతోంది. అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్‌లో తమకు ఏం కావాలో సూచనలు ఇవ్వొచ్చు. మోదీ 2.0 ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన మొదటి బడ్జెట్‌ను జూలై 5న సమర్పించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందు జూలై 4న 2019-20 ఎకనమిక్ సర్వే సమర్పిస్తుంది ఆర్థిక శాఖ. 

Tags:    

Similar News