మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్

మాజీ రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం బయోపిక్ పోస్టర్‌ను.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ విడుదల చేశారు.

Update: 2020-02-09 11:03 GMT

మాజీ రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం బయోపిక్ పోస్టర్‌ను.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ విడుదల చేశారు. తెలుగు హాస్యనటుడు అలీ కలాం పాత్రధారిగా నటిస్తున్నారు. జగదీశ్ దానేటి దర్శకత్వంలో, హాలీవుడ్‌కు చెందిన జానీ మార్టిన్ నిర్మాతగా.. పింక్ జాగ్వర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని.. ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలను కేంద్రమంత్రి జవడేకర్ అభినందించారు. ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందని అలీ చెప్పారు. దేశ ప్రజల మనసులను గెల్చుకున్న అత్యంత గొప్ప వ్యక్తి అని అబ్దుల్ కలాంను కొనియాడారు.


Full View


Tags:    

Similar News