సిక్కింలో వరదలు..300 మంది పర్యాటకులను కాపాడిన పోలీసులు

Update: 2019-06-18 08:22 GMT

ఆకస్మిక వరదలు సిక్కింను ముంచెత్తాయి. వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాలు నీటి మునిగిపోయాయి.వరదల వల్ల రవాణా, టెలిఫోన్, కరెంట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వందల సంఖ్యలో నివాసాలు ధ్వంసమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో జిమా వద్ద చిక్కుకు పోయిన 300మంది పర్యాటకులను లాచెన్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాల వల్ల చుంగ్ థాంగ్-లాచెన్-థుంగ్ రోడ్డు తెగిపోయింది. సిక్కింలో వరదల వల్ల పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వరదనీరు పోటెత్తడంతో పర్యాటకులను సురక్షిత ప్రాంతమైన లాచెన్ కు తరలించారు.

Tags:    

Similar News