Flight Operations: చల్లారిన ఉద్రిక్తతలు..32 విమానాశ్రయాలు రీఓపెన్‌

Flight Operations: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు.

Update: 2025-05-12 08:49 GMT

Flight Operations: చల్లారిన ఉద్రిక్తతలు..32 విమానాశ్రయాలు రీఓపెన్‌

Flight Operations: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. అయితే, తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్‌పోర్ట్స్‌ను అధికారులు తిరిగి తెరిచారు. 32 విమానాశ్రయాలను తిరిగి తెరిచినట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లాయి. పాక్‌ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై AAI నిషేధం విధించింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

అధంపూర్‌, అంబాలా, అమృత్‌సర్‌, అవంతీపురా, భటిండా, బికనేర్‌, భూజ్‌, చంఢీగఢ్‌, హల్వారా, హిండన్‌, జమ్ము, జామ్‌నగర్‌, జోథ్‌పూర్‌, జైసల్మేర్‌, కండాలా, కాంగ్రా, కేషోడ్‌, కిషన్‌గఢ్‌, కులు మనాలి, లేహ్‌, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్‌, పటియాలా, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, సర్సావా, శ్రీనగర్‌, షిమ్లా, తోయ్‌స్‌, ఉత్తర్‌లాయ్‌ ఎయిర్‌పోర్టులను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15 వరకు ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి ఎలాంటి విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరడంతో అధికారులు ఆయా విమానాశ్రయాలను తిరిగితెరిచారు.

Tags:    

Similar News