Tollywood News: మళ్లీ ఇన్నాళ్లకు ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా

* మళ్లీ ఇన్నేళ్ల తరువాత శేఖర్ కమ్ముల సినిమాలో హీరోగా నటించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2022-11-13 15:00 GMT

మళ్లీ ఇన్నాళ్లకు ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా

Vijay Devarakonda: రౌడీ బాయ్ గా పేరు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ చాలా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ ని దక్కించుకున్న హీరో. "పెళ్లి చూపులు" తో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఆ తర్వాత "గీత గోవిందం" వంటి సూపర్ హిట్ తో హార్ట్ త్రోబ్ అయిపోయాడు. కానీ ఈ మధ్య విజయ్ ఆ క్రేజ్ కి తగ్గ సినిమాలని చేయడంలో విఫలమయ్యారు అని సమాచారం. విజయ్ దేవరకొండ ఈమధ్యనే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ప్యాన్ ఇండియా మూవీ 'లైగర్' కూడా భారీ డిజాస్టర్ గా మారింది. సినిమాకోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టమంతా బూడిద లో పోసిన పన్నీరు అయ్యింది.

బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు బాలీవుడ్ లోకి అడుగు పెడదాం అనుకున్న విజయ్ దేవరకొండ కలలు కలలు గానే మిగిలిపోయాయి. మళ్లీ పూరి తోనే చేయాలి అనుకున్న "జనగణమన" ప్రాజెక్ట్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో "ఖుషీ" మూవీ చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కానీ సామ్ ఆనారోగ్యం కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక హరీష్ శంకర్, పరశురామ్, గౌతమ్ తిన్ననూరి, వంటి దర్శకులు విజయ్ తో సినిమా చేస్తున్నాడు అని తెలుస్తోంది కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. తాజాగా శేఖర్ కమ్ముల పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. గతం లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" లో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అదే శేఖర్ కమ్ముల సినిమాలో హీరోగా నటించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News