Bandla Ganesh Thanks to Harish Shankar: హరీష్ కి బండ్ల థాంక్స్!

Bandla Ganesh Thanks to Harish Shankar: గత కొద్దిరోజల క్రితం నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ మధ్య చిన్న చిన్న విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే..

Update: 2020-07-26 16:03 GMT
Bandla Ganesh and Harish shankar ( File photo)

Bandla Ganesh Thanks to Harish Shankar: గత కొద్దిరోజల క్రితం నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ మధ్య చిన్న చిన్న విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ ఇద్దరి కెరీర్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ సంవత్సరంతో 8 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే ఈ లేఖలో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు.

అయితే హరీష్ ఇది కావాలని చేశారో, తెలియక చేశారో తెలియదు కానీ దీనిపైన బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. 'అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా హరీష్ శంకర్ కి పవన్ తో సినిమా తీసే ఛాన్స్ ని ఇచ్చానని, ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయని గణేష్ వరుస ట్వీట్లు చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ కి హరీష్ శంకర్ కాల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. హరీష్ తనకు‌ కాల్‌ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్‌ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. దీనితో గతంలో వీరి మధ్య వచ్చిన పోట్లాటలకి బ్రేక్ వేసినట్టు అయింది. ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా బిజీగా ఉండగా, హరీష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. 



Tags:    

Similar News