Bandla Ganesh Comments on Pawan klayan: పవర్ స్టార్‌ అభిమానులకు ఈ ఏడాది పండగే : బండ్ల గణేష్!

Bandla Ganesh Comments on Pawan klayan: పవర్ స్టార్‌ అభిమానులకు ఈ ఏడాది పండగే : బండ్ల గణేష్!
x
Pawan Kalyan and Bandla Ganesh (File Photo)
Highlights

Bandla Ganesh Intresting Comments on Pawan klayan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత వీరాభిమానియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Bandla Ganesh Intresting Comments on Pawan klayan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత వీరాభిమానియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. " ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్ తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే నేను మన పవర్ స్టార్ అభిమానులు ఈ సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా ఇది నా సంకల్పం " అంటూ గబ్బర్ సింగ్ హష్ ట్యాగ్ ని జత చేశారు బండ్ల గణేష్.. చూస్తుంటే పవన్ తో మరో సినిమాని చేసే ప్లాన్ లో గణేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇందులో తీన్ మార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన గబ్బర్ సింగ్ మాత్రం భారీ వసూళ్లు సాధించి బండ్ల గణేష్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మళ్లీ పవర్ స్టార్ తో ఓ సినిమాని చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. తాజాగా గబ్బర్ సింగ్ చిత్రం ఎనమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బండ్ల గణేష్ తన ఇంట్లో హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే..

"అందరూ పుట్టిన రోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు కానీ.. నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను. గబ్బర్ సింగ్ అనేది నాకు దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష. ఎప్పటికీ ఆయనకు నేను కృతజ్ఞుణ్ణి " అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఇక అటు పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వచ్చేసరికి రెండేళ్ల రాజకీయం తరవాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన రీఎంట్రీ మూవీగా బాలీవుడ్ లో మంచి హిట్ అయిన పింక్ సినిమాని వకీల్ సాబ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు బోణి కపూర్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories