Pawan Kalyan Sets New Record: పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా.. ట్విట్టర్ లో రికార్డు!

Pawan Kalyan Sets New Record: టాలీవుడ్ టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు..

Update: 2020-07-15 10:15 GMT
Pawan Kalyan (File Photo)

Pawan Kalyan Sets New Record: టాలీవుడ్ టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పెట్టిన పవన్ తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఆయనకి ఫ్యాన్ ఉన్నారు. అయితే దాదాపుగా సినిమాల నుంచి రెండేళ్ల విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్.. మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు .. ఇంకా నెలన్నర సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఫ్యాన్ ట్విట్టర్ లోహంగామా మొదలుపెట్టేశారు.

#AdvancedHBDPawanKalyan అనే హాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏకంగా ఇది జాతీయ రికార్డు సృష్టించింది. మొత్తం ఈ హాష్ ట్యాగ్ తో కేవలం 24 గంటల్లోనే 27.3 మిలియన్ల ట్వీట్స్ చేసి రికార్డు సృష్టించారు.. అయితే ఇంతవరకు ఏ హీరోకు కూడా ఇంత పెద్ద సంఖ్యలో బర్త్ డే ట్వీట్స్ రాలేదని సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇక ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, బర్త్ డే వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు..

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వచ్చేసరికి పవన్ రీఎంట్రీ మూవీగా రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది.ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు.


Tags:    

Similar News