Vakeel Saab Teaser: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తుంది!

Vakeel Saab Teaser: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది.

Krishna
Published on: 14 July 2020 6:08 PM IST
Vakeel Saab Teaser: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తుంది!
X

Vakeel Saab Teaser: రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది.ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. దీనికి ముందు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ , ఓ సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసింది చిత్రబృందం.. అయితే తాజాగా ఫ్యాన్స్ ని సప్రైజ్ చేసేందుకు మేకర్స్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 సందర్భంగా వకీల్ సాబ్' టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.. అటు ట్విట్టర్ లో ఇప్పటికే పవన్ పుట్టినరోజు వేడుకలు మొదలయిపోయాయి. వకీల్ సాబ్‌ కూడా ట్రెండ్ అవుతోంది. దీనితో మేకర్స్ ఆ రోజున సినిమా టీజర్ ని బయటకు వదిలేందుకు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. దీనిపైన త్వ్రాలో అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story