రెండు సినిమాలకు దర్శకత్వం చేయనున్న స్టార్ హీరోయిన్..

అలా మొదలైంది మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మలయాళ కుట్టి నిత్యమీనన్.

Update: 2020-06-23 05:50 GMT
Nithya Menon (File Photo)

అలా మొదలైంది మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మలయాళ కుట్టి నిత్యమీనన్. దక్షిణాది చిత్రపరిశ్రలో అందంతో పాటు అద్భుతమైన నటన, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమ్మడు తెలుగులోనే కాదు తమిళంలో కూడా చక్కటి ఆదరణతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గత కొంతకాలంగా నిత్యామీనన్ కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, నిత్యమీనన్ కావాలని తీసుకుందట. ఎందుకంటే నిత్యకు డైరెక్షన్ వైపు ఆసక్తి ఉందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ లో నిత్య ఉపయోగించుకుంది. ఈ సమయంలో రెండు కథలను సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడట. నిత్య కథ చెప్పిన తర్వాత నిర్మాత ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కథతో ఆమె సెట్స్ పైకి వెళుతుందని టాక్. అయితే లాక్ డౌన్ సమయంలో తను వెయిట్ తగ్గే పనిలో పడిందట. అంతేగాక తన డ్రీమ్ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే పనులు కూడా షురూ చేసింది. ఆ సినిమాలో తను నటించడమే కాకుండా.. దర్శకత్వం చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించనుందట. ఇక ఆ సినిమాను పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందించే ఆలోచనలో ఉందని ఇండస్ట్రీ టాక్. అంతేగాక ఈ మూవీలో ఒక్కో భాషకి ఒక్కో హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీవర్గాలు అంటన్నాయి. నిత్య ఒక్కసారే భారీ బాధ్యతలు ఎత్తుకుందని అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News