TFCC Elections: ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు.. దిల్ రాజు, సి కళ్యాణ్ మధ్య రసవత్తర పోటీ
TFCC Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదల
TFCC Elections: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, సి. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే హోరాహోరీగా సాగిన ప్రచారానికి తెర పడగా ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 4 గంటలకు కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.