Richard Donner: సూపర్ మ్యాన్ సృష్టికర్త రిచార్డ డోనర్ మృతి
Richard Donner: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు సూపర్ మ్యాన్ సృష్టికర్త రిచర్డ్ డోనర్(91) కన్నుమూసారు.
Superman Richard Donner
Richard Donner: చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు సూపర్ మ్యాన్ సృష్టికర్త రిచర్డ్ డోనర్(91) కన్నుమూసారు. ఈయన సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఈ సోమవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేసారు. ఈయన 1960 టీవీల్లో 'ట్విన్ లైట్ జోన్' అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా ఈయన తెరకెక్కించిన 'గూనీస్' సినిమా ఇన్‌స్ప్రేషన్‌తో పలు చిత్రాలను తెరకెక్కించినట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు ఎంతో హాలీవుడ్ దర్శకులకు ఈయన సినిమాలు ఓ నిఘంటువులా పనిచేసాయని కితాబు ఇచ్చారు. ఈయన మృతిపై పలువురు హాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.