Ram Charan - Sukumar: 'రంగస్థలం' మించిపోయేలా లెక్కల మాస్టర్ ప్లాన్!
"రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబో మళ్లీ తెరపైకి రాబోతుంది. గ్లోబల్ స్టార్ కోసం సుకుమార్ ఒక వినూత్నమైన పాత్రను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలతో పాటు, బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న 'పెద్ది' మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్ ఈ స్టోరీలో చదవండి."
Ram Charan - Sukumar: 'రంగస్థలం' మించిపోయేలా లెక్కల మాస్టర్ ప్లాన్!
Ram Charan - Sukumar: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - లెక్కల మాస్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న కొత్త చిత్రంపై ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్లీ చేతులు కలుపుతుండటంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆ తర్వాత సుకుమార్‌తో జతకట్టనున్నారు.
రామ్ చరణ్ కోసం వినూత్న పాత్ర..
సుకుమార్ సినిమాల్లో హీరోల పాత్రలు చాలా భిన్నంగా, రా అండ్ రస్టిక్‌గా ఉంటాయి. 'ఆర్య'లో వన్ సైడ్ లవర్ అయినా, 'పుష్ప'లో తగ్గేదేలే అనే స్మగ్లర్ అయినా.. క్యారెక్టరైజేషన్‌తోనే సుక్కు మ్యాజిక్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా అంతకుమించి అనేలా ఒక వినూత్నమైన, అత్యంత వైవిధ్యమైన పాత్రను లెక్కల మాస్టార్ సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ మేకోవర్, నటన మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది.
ప్రస్తుతం సుకుమార్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారట. సినిమా జోనర్ ఏదైనా సరే, చరణ్ పాత్రను ఎలా మలిస్తే ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారనే అంశంపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సుకుమార్ ప్రాజెక్ట్ కంటే ముందు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈచిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండటంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.