Harish Shankar: 'ఉస్తాద్' కలెక్షన్స్ గురించి మాట్లాడను.. కాస్త ఓవర్ బడ్జెట్ అయినా..!

Harish Shankar: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై వై.రవి శంకర్‌, నవీన్‌ యెర్నేని కలిసి నిర్మించారు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు.

Update: 2026-03-18 12:28 GMT

Harish Shankar: 'ఉస్తాద్' కలెక్షన్స్ గురించి మాట్లాడను.. కాస్త ఓవర్ బడ్జెట్ అయినా..!

Harish Shankar: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై వై.రవి శంకర్‌, నవీన్‌ యెర్నేని కలిసి నిర్మించారు. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. ఉగాది కానుకగా మార్చి 19న (సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మీడియా సమావేశంలో హరీష్ శంకర్, నవీన్ ఎర్నేని, శ్రీలీల, రాశి ఖన్నాలు పాల్గొని సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ... 'చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక బిగ్ స్టార్ నటిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా, సామాన్య ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను పూర్తి స్థాయి ఎనర్జిటిక్ రోల్‌లో ఈ సినిమాలో చూడొచ్చు. సినిమాను మొత్తం 2 గంటల 58 నిమిషాలు షూట్ చేయగా.. కేవలం 14 నిమిషాలు మాత్రమే ఎడిటింగ్‌లో తొలగించాము. కథను ఎక్కడా సాగదీయకుండా షార్ప్‌గా తీర్చిదిద్దాము. సినిమా ఇంత వేగంగా, అనుకున్న విధంగా రావడానికి పవన్ కళ్యాణ్ గారి క్రమశిక్షణే ప్రధాన కారణం' అని కొనియాడారు.


ఉస్తాద్ సినిమా అంత కలెక్షన్స్ చేస్తుంది, ఇంత కలెక్షన్స్ చేస్తుందని ఇప్పుడే ఏమి చెప్పను. ఎందుకంటే అది రిలీజ్ తేదీతో పాటు సినిమా విడుదలైన సీజన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.

'ఉస్తాద్ సినిమా కొంత ఆలస్యం అవ్వడం వల్ల బడ్జెట్ పెరిగినప్పటికీ.. పాటల సెట్స్ విషయంలో మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అందుకు వారికి కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ డేట్ ప్రీ-పోన్ అయిన తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక హీరోలా బాధ్యత తీసుకుని అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) అందించారు. దురంధర్ 2 వంటి భారీ సినిమా పోటీలో ఉన్నప్పటికీ, మా సినిమా జానర్ వేరు. సాధారణ సినిమా ప్రేమికులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాం' అని డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ ధీమా వ్యక్తం చేశారు. సినిమా కోసం తనతో పాటు పని చేసిన హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్స్, టెక్నీషియన్స్.. అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Tags:    

Similar News