Ram Charan's Peddi: 'పెద్ది' సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో సందడి.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్ చరణ్!

Ram Charan's Peddi: ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న పెద్ది చిత్ర సెట్స్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాలో కీలక సభ్యుడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ షూటింగ్ స్పాట్‌ను సందర్శించారు.

Update: 2026-03-18 15:12 GMT

Ram Charan's Peddi: 'పెద్ది' సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో సందడి.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్ చరణ్!

Ram Charan's Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం.. పెద్ది మూవీ మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెండింగ్‌ ఉండటంతో ఏప్రిల్‌ 30కి వాయిదా పడింది.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న పెద్ది చిత్ర సెట్స్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాలో కీలక సభ్యుడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ షూటింగ్ స్పాట్‌ను సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన తిలక్.. రామ్ చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చరణ్ వరల్డ్ కప్‌లో తిలక్ ప్రదర్శనను అభినందించారు. సినిమాలో తాను వాడిన ఒక ఓల్డ్ క్రికెట్ బ్యాట్‌ను అతనికి గిఫ్ట్‌గా అందజేశారు. దాంతో తిలక్ సంతోషం వ్యక్తం చేశారు. సెట్స్‌లో చిత్రీకరిస్తున్న ఇంటెన్స్ స్పోర్ట్స్ సీక్వెన్స్‌లను తిలక్ ఎంతో ఆసక్తిగా గమనించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ది చిత్రాన్ని ఒక పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. వేసవి కానుకగా రానున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు భారతదేశం 2026 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనలు జట్టు టైటిల్ సాధించడంలో సహాయపడ్డాయి. మెగా టోర్నీలో తిలక ముందుగా కాస్త తడబడ్డా.. ఆపై పుంజుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో 4 మ్యాచ్‌లలో 120.45 స్ట్రైక్ రేట్‌తో 106 పరుగులు చేశాడు. ఇందులో జింబాబ్వేపై చేసిన 44 పరుగులు కూడా ఉన్నాయి. మార్చి 17న హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తిలక్ సత్కరించబడ్డాడు.

Tags:    

Similar News