Dhurandhar 2: ధురందర్ 2 లో డైరెక్టర్ భార్య.. కీ రోల్ ప్లే చేయనున్న యామీ గౌతమ్!
Dhurandhar 2: రణవీర్ సింగ్ 'ధురందర్ 2'లో యామీ గౌతమ్ సర్ప్రైజ్ ఎంట్రీ! ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ మూవీలో ఆమె పోషించిన కీలకమైన పాత్ర ఏంటో, అది హీరో మిషన్‌ను ఎలా మలుపు తిప్పబోతుందో ఈ స్టోరీలో చదవండి.
Dhurandhar 2: ధురందర్ 2 లో డైరెక్టర్ భార్య.. కీ రోల్ ప్లే చేయనున్న యామీ గౌతమ్!
Dhurandhar 2: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ 'ధురందర్ 2: ది రివెంజ్' విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన సర్ప్రైజ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటి యామీ గౌతమ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
యామీ గౌతమ్ పాత్ర ఏంటంటే..
తాజా నివేదికల ప్రకారం.. యామీ గౌతమ్ ఈ చిత్రంలో 'షాజియా బానో' అనే పేరుతో అతిథి పాత్రలో మెరవనుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని స్క్రీన్‌షాట్ల ప్రకారం, ఆమె ఒక డాక్టర్ పాత్రలో కనిపించబోతోంది. సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో "YG" (Yami Gautam) అని పేరు ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇది కేవలం చిన్న అతిథి పాత్ర మాత్రమే కాకుండా, కథలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమయ్యే పాత్ర అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి యామీ గౌతమ్ భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సినిమాలో ఒక ఆసుపత్రి సన్నివేశం హీరో మిషన్‌ను ప్రభావితం చేసేలా ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుందని, అక్కడే యామీ గౌతమ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. రణవీర్ సింగ్ ఇందులో 'హమ్జా అలీ మజారీ' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. 'ధురందర్ 2'లో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌లో హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మార్చి 18(నేడు) పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కానుండటంతో మెగా ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.